Skip to main content

ఏ రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు కానుంది?

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తాజాగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీతో ఫోన్‌లో 75 నిమిషాల పాటు చర్చలు జరిపారు.
Current Affairs
ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు చేయడానికి ఇరువురు అంగీకరించారు. హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకొని, ఇకపై తరచూ మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనడం అత్యవసరమని జైశంకర్‌ పేర్కొన్నారు.

సిరియాపై అమెరికా వైమానిక దాడులు
సిరియా దేశంలో ఇరాన్‌ మద్దతు కలిగిన ఇరాక్‌ మిలిటెంట్‌ గ్రూపు స్థావరాలపై ఫిబ్రవరి 26న అమెరికా వైమానిక దాడులు చేసింది. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్‌ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. దాడుల్లో ఉగ్ర స్థావరాల ధ్వంసంతోపాటు 22 మంది మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ చెబుతోంది.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : ఏ రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : భారత్, చైనా
ఎందుకు : ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపేందుకు
Published date : 27 Feb 2021 05:58PM

Photo Stories