Skip to main content

ఏ రాష్ట్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది?

డ్రాగన్ దేశం చైనా.. భారత భూభాగంలో ఒక కొత్త గ్రామాన్నే నిర్మించింది. 2020, నవంబర్ 1వ తేదీ నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Current Affairs
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలో త్సరి చూ నది(Tsari Chu) ఒడ్డున ఈ గ్రామాన్ని చైనా నిర్మించింది. ఇక్కడ 101 ఇళ్లు ఉన్నాయి. ఇరు దేశాల సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇళ్లు నిర్మించారు.

అధికారిక మ్యాప్‌ల ప్రకారం....
భారత ప్రభుత్వ అధికారిక మ్యాప్‌ల ప్రకారం చైనా నిర్మించిన గ్రామం భారతదేశ భూభాగమే. అయితే, ఈ ప్రాంతం 1959 నుంచి చైనా అధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ చైనా మిలటరీ పోస్టు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక కొత్త ఊరే పుట్టుకొచ్చింది. ఈ ప్రాంతంపై భారత్-చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. 2019 ఆగస్టు 26 నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే త్సరి చూ నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు లేవు. అంటే 2020 ఏడాదే ఈ కొత్త గ్రామాన్ని చైనా నిర్మించినట్లు స్పష్టమవుతోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వివాదాస్పద ప్రాంతంలోకొత్త గ్రామం నిర్మాణం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : చైనా
ఎక్కడ : త్సరి చూ నది(Tsari Chu) ఒడ్డున, అప్పర్ సుబాన్‌సిరి జిల్లా, అరుణాచల్ ప్రదేశ్
Published date : 21 Jan 2021 04:13PM

Photo Stories