Skip to main content

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్చారు?

డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ పేరుని ‘‘కమలం’’గా మార్చాలని నిర్ణయించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని ఇటీవల ప్రకటించారు.
Current Affairsడ్రాగన్ అనే పదం చైనాని స్ఫరింపజేస్తోందని, అందుకే ఈ పండుకి స్థానిక పేరుని పెట్టాలనుకున్నట్లు తెలిపారు. పోషకాల పరంగా ఇది అత్యంత విలువైన పండు అని రూపాని అన్నారు. ప్రధానంగా ఆసియా దేశాల నుంచి, దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ విరివిగా వాడుతున్నారు. 1990లనుంచీ భారత్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది?
డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందినది. ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ’పితాహాయ’ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. వియత్నాంలో ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మార్పు
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని
ఎందుకు : డ్రాగన్ ఫ్రూట్ రూపం తామర పుష్పాన్ని పోలి ఉండడంతో

 

Published date : 03 Feb 2021 05:33PM

Photo Stories