Skip to main content

ఏ రాష్ట్ర గ‌వ‌ర్నర్‌కు కళింగరత్న మకుటంను ప్రదానం చేశారు?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రతిష్టాత్మక కళింగరత్న సత్కారం లభించింది.
Current Affairs
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కళింగరత్న మకుటం ప్రదానం చేసి సత్కరించారు. ఒడిశాలోని కటక్‌ నగరంలో ఏప్రిల్‌ 2న జరిగిన ఆదికవి సరళదాస్‌ 600వ జయంత్యుత్సవం వేదికపై ఈ సత్కారం చేశారు. కార్యక్రమంలో పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఒడిశా గవర్నర్‌ ఆచార్య గణేషీ లాల్, సరళ సాహిత్య సంసద్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రభాకర్‌ స్వాయి పాల్గొన్నారు.

ఒడిశా...
అవతరణ:
ఆగస్టు 15, 1947.
విస్తీర్ణం: 1,55,707 చ.కి.మీ.
రాజధాని: భువనేశ్వర్‌
ప్రస్తుత గవర్నర్‌: గణేషీ లాల్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: నవీన్‌ పట్నాయక్‌
సరిహద్దు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్, పశ్చిమబెంగాల్‌
మొత్తం జిల్లాలు: 30 (అంగుల్, బొలంగిర్, బాలాసోర్, బర్‌గత్, బద్రక్, భోద్, కటక్, డియోగర్, దెంకనాల్, గజపతి, గంజామ్, జగత్‌సింగ్‌పూర్, జయ్‌పూర్, జర్సుగుడా, కలహండి, కందమల్, కేంద్రపర, కియంజర్, మల్కజ్‌గిరి, మయూర్‌బంగ్, నవరంగాపూర్, నయగఢ్, నౌపడ, రాయగడ, పూరీ, సంబల్‌పూర్, సోనీపూర్, సుందర్‌గర్‌)
కార్యనిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 147
లోక్‌సభ సీట్లు: 21
రాజ్యసభ సీట్లు: 10
ప్రధాన భాష: ఒరియా
హైకోర్టు: కటక్‌
ప్రధాన మతం: హిందూమతం, జైనమతం, ఇస్లాం.
ముఖ్యనగరాలు: భువనేశ్వర్, కటక్, చత్రాపూర్, పూరి, సంబల్‌పూర్, బొలంగిర్, జర్సుగుడా, బరగర్, కొరాపుట్, రూర్కెలా, బాలాసోర్, బరిపెడ, బరంపూర్, బద్రక్, నవరంగాపూర్, రాయగడ, భవానిపట్నం, పుల్‌బాని, దెంకానాల్, కేంద్రపర, కీన్‌జర్, కోనార్క్, సుందర్‌గర్‌
నదులు: మహానది, బ్రాహ్మణి, టెల పుషికూల్యా, శబరీ, వైతరణి.
పర్వత శిఖారాలు: గర్‌జాత్‌ హిల్స్, మహేంద్రగిరి.
సరస్సులు: చిల్కా (64 కి.మీ. పొడవు, 16–20 కి.మీ వెడల్పు)
జాతీయపార్కులు: బితర్‌కనికా వన్యప్రాణుల అభయారణ్యం.
ఖనిజాలు: క్రోమైట్, బాక్సైట్, డోలమైట్, గ్రాఫైట్, ఐరెన్‌ ఓర్, బొగ్గు, రాగి, కొలిన్, లిడ్, క్వార్ట్‌జైట్, స్టీటైట్, టిన్‌.
పరిశ్రమలు: స్టీల్‌ ప్లాంట్, సాండ్‌ కాంప్లెక్స్, భారీ నీటి ప్రాజెక్ట్, కోచ్‌ రిపేర్‌ వర్క్‌షాపు, అల్యూమినియం, విద్యుత్‌ ప్లాంట్‌లు, థర్మల్‌ – హైడల్‌ విద్యుత్‌ స్టేషన్లు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, జూటు, చెరకు(ప్రధార వాణిజ్య పంట), పసుపు, కొబ్బరి,
విమానాశ్రయాలు: భువనేశ్వర్‌
ఓడరేవు: పారాదీప్, గోపాల్‌పూర్‌
నృత్యం: ఒడిస్సీ, దల్‌కాయ్‌(గిరిజన), గూమ్రా, రనప, ఛా–దయ(ఫోక్‌),
పండుగలు: రథయాత్ర, శరబన్‌ పూర్ణిమ, అశోకాష్టమీ, చందన్‌ యాత్ర, స్నానయ్రా, కోనార్క్‌ పండుగ.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రతిష్టాత్మక కళింగరత్న సత్కారం ప్రదానం
ఎప్పుడు : ఏప్రిల్‌
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : కటక్, ఒడిశా
Published date : 03 Apr 2021 05:29PM

Photo Stories