ఏ పథకంలో భాగంగా కేఐఎస్‌సీఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు?
భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్‌లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో భాగంగా కేఐఎస్‌సీఈలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నిర్వహిస్తామనికేంద్ర క్రీడా శాఖ పేర్కొంది.
తొలి దశలో...
తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కేఐఎస్‌సీఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్‌ను క్రీడాశాఖ వెచ్చించనుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్‌ట్స సైన్స్ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్ కండిషనింగ్ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
చదవండి: కేఐఎస్‌సీఈల ఏర్పాటు ఉద్దేశం, తెలంగాణలోని ఏ స్పోర్ట్స్ స్కూల్‌ను కేఐఎస్‌సీఈ కేంద్రంగా ప్రకటించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖేలో ఇండియా పథకంలో భాగంగా కేఐఎస్‌సీఈ కేంద్రాల అభివృద్ధి
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : కేంద్ర క్రీడా శాఖ
ఎక్కడ : తెలంగాణ, ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ
ఎందుకు : భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్‌లను తయారు చేయడం కోసం