ఏ పథకం కింద గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు?
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వదేశీ దర్శన్’’ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు.
శిథిలావస్థకు చేరుకున్న ఈ కోట పునరుద్ధరణ కోసం రూ.3.92 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు ఐటీడీఏ ద్వారా మంజూరవుతుండగా, రాష్ట్ర టూరిజం శాఖ పనులను చేపడుతోంది. గోండురాజుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే శిల్ప, హస్త కళాకారులు తయారు చేసిన వాటిని ప్రదర్శనగా ఉంచేందుకు మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో...
భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా... మరియా గోండ్లు, కొండ మరియలు, భిషోహార్ మరియలు అనే మూడు రకాలున్నాయి. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండులకు పుట్టినిల్లు. తెలంగాణలో ఉన్న గోండులను ప్రధానంగా రాజగోండులు అని అంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోండురాజుల కోట పునరుద్ధరణకు చర్యలు
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న
ఎందుకు : స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా

Published date : 04 Feb 2021 06:12PM