ఏ ప్రైవేటు బ్యాంక్‌పై భారతం ప్రభుత్వం మారటోరియంను విధించింది?
Sakshi Education
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)పై భారత ప్రభుత్వం నవంబర్ 17న మారటోరియంను విధించింది.
నవంబర్ 17 నుంచి నుంచి 30 రోజులపాటు- డిసెంబర్ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ నియమితులయ్యారు.
డీబీఎస్ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన...
తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్‌బీఐ వెలువరించింది.
1926లో స్థాపన...
రిటైల్, మిడ్-మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును వీఎస్‌ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)పై మారటోరియం విధింపు
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో

Published date : 18 Nov 2020 05:37PM