Skip to main content

ఏ ప్రాజెక్టులో భాగంగా భారత్ ఆరు జలాంతర్గాములను నిర్మించనుంది?

నావికా దళాన్ని మరింత శక్తిమంతం చేయడం కోసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భారీ మేకిన్‌ ఇండియా ప్రాజెక్టు <strong>‘‘పీ–75 ఇండియా’’</strong>కుభారత రక్షణ శాఖ జూన్ 4న ఆమోదం తెలిపింది.
Current Affairs
ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.43 వేల కోట్ల అంచనాతో 6 జలాంతర్గాములను నిర్మించనున్నారు.భారత నేవీని బలోపేతం చేయాలని రక్షణ శాఖలో కొనుగోళ్ల వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత సంస్థ డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జలాంతర్గాముల తయారీకి సంబంధించిన ప్రాజెక్టు పీ–75 ఇండియాను ఆమోదించారు.పీ–75 ప్రాజెక్టుతో పాటుగా రూ.6,800 కోట్లతో ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం భారత నేవీకి 15 జలాంతర్గాములు, 2 అణు జలాంతర్గాములు ఉన్నాయి. కొత్తగా 6 అణు జలాంతర్గాములు సహా 24 జలాంతర్గాములు కొనుగోలు చేయాలని నావికాదళం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం చైనా వద్ద 50 సబ్‌ మెరైన్లు, 350 యుద్ధ నౌకలు ఉన్నట్లు నిపుణుల అంచనా. రాబోయే 8–10 ఏళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.

పీ–75 ప్రాజెక్టు విశేషాలు...

- ఆరు జలాంతర్గాముల్ని వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్‌లో తయారు చేస్తారు.స్వదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీల సాయంతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాయి.
- ప్రాజెక్టు కాల వ్యవధి 12 ఏళ్లు
- అంచనా వ్యయం రూ.43 వేల కోట్లు
- ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వ రంగ మాజగావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడతాయి.
- ఎల్‌అండ్‌టీ, ఎండీఎల్‌లు తాము సహకారం తీసుకునే విదేశీ కంపెనీల షార్ట్‌ లిస్ట్‌ను ఇప్పటికే రూపొందించాయి. రోజోబోర్న్‌ ఎక్స్‌పోర్ట్‌ (రష్యా), దావూ (దక్షిణ కొరియా) థిస్సెన్‌క్రుప్‌ మెరైన్‌ సిస్టమ్స్‌ (జర్మనీ), నవనీత (స్పెయిన్‌), నేవల్‌ గ్రూపు (ఫ్రాన్స్‌) కంపెనీలు ఈ షార్ట్‌ లిస్టులో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మేకిన్‌ ఇండియా ప్రాజెక్టు ‘‘పీ–75 ఇండియా’’లోభాగంగాఆరు జలాంతర్గాములను నిర్మాణం ఎప్పుడు : జూన్ 4
ఎవరు : భారత్
ఎందుకు :భారత నావికా దళాన్ని మరింత శక్తిమంతం చేయడం కోసం...
Published date : 05 Jun 2021 06:36PM

Photo Stories