ఏ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టనుంది?
Sakshi Education
భూ రక్షణకు సంబంధించి ‘భూమి రక్ష’ పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నవంబర్ 5న నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
2021, జనవరి 1న ప్రారంభమయ్యే ఈ సర్వేను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సర్వే చేసిన ప్రతి భూమికి యునిక్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా పట్టాదారుడు తన భూమి వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. అన్ని లావాదేవీలకు ఈ నంబర్ వర్తిస్తుంది. వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మున్సిపాల్టీలలోని నివాసిత స్థ్ధలాలకు సంబంధించి పక్కా పాస్‌బుక్, లీగల్ టైటిల్ కల్పించడమే సర్వే లక్ష్యం.
మచిలీపట్నం పోర్టుకు రూ.5,835 కోట్లు...
- మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు రైట్స్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడంతో పాటు ఆ ప్రాజెక్టు మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,835 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
- మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.90 కోట్లు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారిటైం బోర్డు మొత్తం రూ.4,745 కోట్లు సేకరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
Published date : 06 Nov 2020 06:01PM