ఏ మాజీ సీజేఐకి జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు?
దేశంలో ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) కమాండోలు భద్రత కల్పిస్తారు. జస్టిస్ గొగోయ్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖుల్లో 63వ వారు. ఆయనకు 8 నుంచి 12 మంది కమాండోల భద్రత ఎల్లప్పుడూ ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ రెండో భద్రతా విభాగం.
2019లో రాజ్యసభకు...
2019 నవంబర్‌లో సీజేఐగా రిటైరైన గొగోయ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ సీజేఐగా జస్టిస్ గొగోయ్ నిలిచారు. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు.
సుప్రీంకోర్టు 46వ సీజేఐగా....
అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గొగోయ్ 2001లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు 46వ సీజేఐగా 2018, అక్టోబర్ 3న ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 17న పదవీ విరమణ చేశారు. 2019, నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు.
భారత్ - కీలక భద్రతా వ్యవస్థలు
భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం ఐదు రకాలైన భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అవి:
- స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)
- జెడ్ ప్లస్ కేటగిరీ
- జెడ్ కేటగిరీ
- వై కేటగిరీ
- ఎక్స్ కేటగిరీ