Skip to main content

ఏ కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నారు?

చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మల్టీ ప్రొడక్ట్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సెప్టెంబర్ 21న ప్రకటించింది.
Edu newsఈ కారిడార్ అభివృద్ధికి ఇప్పటికే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్‌సీడీఐటీ) ఆమోదం లభించించగా.. ఇంకా కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేసే కృష్ణపట్నం పారిశ్రామిక వాడ పనులను 2021లో ప్రారంభించి నాలుగు దశల్లో 2024 నాటికి పూర్తి చేయాలని డీపీఐఐటీ లక్ష్యంగా పెట్టుకుంది.
 
 మరో పారిశ్రామిక కారిడార్...
 కొత్తగా హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు డీపీఐఐటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్ల సంఖ్య 11కు చేరింది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : కృష్ణపట్నం మల్టీ ప్రొడక్ట్ పార్కు అభివృద్ధి
 ఎప్పుడు  : సెప్టెంబర్ 21
 ఎవరు  : డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)
 ఎక్కడ  : కృష్ణపట్నం, నెల్లూరు జిల్లా
 ఎందుకు : చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా...
Published date : 22 Sep 2020 06:09PM

Photo Stories