ఏ జిల్లాలోని బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది?
Sakshi Education
వైఎస్సార్ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి 22 లక్షల మెట్రిక్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది.
ఈ మేరకు ఇ-టెండర్ కమ్ ఇ-వేలం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఏడాదిలో 10 లక్షల టన్నుల ఎ-గ్రేడ్, 2 లక్షల టన్నుల బి-గ్రేడ్, 10 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించనున్నట్లు ఫిబ్రవరి 7న ఏపీఎండీసీ తెలిపింది.
బెరైటీస్
1992 నాటికి 5,08,000 టన్నుల బెరైటీస్ ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. బెరైటీస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలు, రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతాల్లో లభిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎక్కడ : వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్

Published date : 08 Feb 2021 06:23PM