Skip to main content

ఏ ఏడాది ఆసియా క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు?

చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమివ్వనున్న 2022 ఆసియా క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు.
Current Affairs 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా ఖరారు చేస్తూ ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

బ్రేక్ డ్యాన్స్‌తో పాటు 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్‌ (ఎలక్ట్రానిక్ క్రీడలు) కూడా మెడల్ ఈవెంట్‌గా మారింది. ఈ-స్పోర్ట్స్‌ ఆసియా క్రీడలకు కొత్తకాదు. 2007 మకావులో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో తొలిసారిగా మెడల్ ఈవెంట్‌గా ఆడించారు. 2018 ఆసియా క్రీడల్లో (ఇండోనేసియా) కూడా ఈ-స్పోర్ట్స్‌ ఉన్నప్పటికీ ఓవరాల్ పతకాల పట్టికలో వాటిని పరిగణించలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2022 ఆసియా క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్పు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)
ఎక్కడ : హాంగ్జౌ నగరం, చైనా
Published date : 19 Dec 2020 07:23PM

Photo Stories