Skip to main content

ఏ దేశానికి చెందిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి?

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు కిర్గిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Current Affairs
దేశ రాజధాని బిష్కేక్‌లో ఫలితాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పలు నగరాల్లో ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శకులు నిరసనలు తెలుపుతూ పలు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష సమర్ధకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో వందలాది మంది గాయపడ్డారు. దేశంలో ఉద్రిక్తతల నివారణకు ఫలితాలను రద్దు చేసామని ఎన్నికల సంఘం అధ్యక్షుడు నుర్జహాన్ షైల్డబెకోవా చెప్పారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కిర్గిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రద్దు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : కిర్గిస్థాన్ ఎన్నికల సంఘం
ఎందుకు : దేశంలో ఉద్రిక్తతల నివారణకు
Published date : 08 Oct 2020 12:38PM

Photo Stories