ఏ దేశ సైన్యానికి లక్ష డోసుల కరోనా టీకాలను భారత్ అందజేసింది?
Sakshi Education
భారత సైన్యం పొరుగు దేశం నేపాల్ సైన్యానికి మార్చి 30న లక్ష డోసుల కరోనా టీకాలను అందజేసింది.
నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యం ఔదార్యం ప్రదర్శించింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత ఆర్మీ అధికారులు నేపాల్ సైనికాధికారులకు లక్ష డోసులను అందజేశారు. ఈ టీకా డోసులను భారత్‌లోనే తయారు చేశారు. భారత్ గతంలోనే నేపాల్‌కు 10 లక్షల డోసుల కరోనా టీకాలను ఇచ్చింది. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏ దేశ సైన్యానికి లక్ష డోసుల కరోనా టీకాలను భారత్ అందజేసింది?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : భారత్
ఎక్కడ : త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఖాట్మాండు, నేపాల్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగాక్విక్ రివ్యూ :
ఏమిటి : ఏ దేశ సైన్యానికి లక్ష డోసుల కరోనా టీకాలను భారత్ అందజేసింది?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : భారత్
ఎక్కడ : త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఖాట్మాండు, నేపాల్
Published date : 31 Mar 2021 06:05PM