ఏ దేశ ప్రధానమంత్రికి కోవిడ్ జరిమానా విధించారు?
Sakshi Education
కోవిడ్ నిబంధనలను అతిక్రమించినందుకు నార్వే ప్రధాన మంత్రి ఎర్నా సోల్‌బెర్గ్‌కు ఆ దేశ పోలీసులు రూ. 1,75,690 జరిమానా విధించారు.
నార్వే...
రాజధాని: ఓస్లో; కరెన్సీ: నార్వేజియన్ క్రోన్
నార్వే ప్రస్తుత రాజు: హరాల్డ్ వి
నార్వే ప్రస్తుత ప్రధాని: ఎర్నా సోల్‌బెర్గ్
దేశాధినేత స్థాయిలో ఉన్న వ్యక్తికి కోవిడ్ నిబంధనల పేరుతో జరిమానా పడటంతో ఆమె వార్తల్లోకెక్కారు. నార్వే ప్రధాని ఎర్నా 2021, ఫిబ్రవరిలో తన 60వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు తెలిపారు. తన చర్యకుగానూ ప్రధాని ఎర్నా సైతం క్షమాపణలు చెప్పారు. ఆమె రెండు సార్లు నార్వే ప్రధానమంత్రిగా పనిచేశారు.
నార్వే...
రాజధాని: ఓస్లో; కరెన్సీ: నార్వేజియన్ క్రోన్
నార్వే ప్రస్తుత రాజు: హరాల్డ్ వి
నార్వే ప్రస్తుత ప్రధాని: ఎర్నా సోల్‌బెర్గ్
Published date : 10 Apr 2021 06:23PM