ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే...
Sakshi Education
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020-21లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి.
ధరలు తగ్గేవి ఇవే..
అలాగే ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది.
ధరలు పెరిగేవి ఇవే..
- స్టీలు
- ఫర్నీచర్
- చెప్పులు
- సిగరెట్లు
- పొగాకు ఉత్పత్తులు
- వైద్య పరికరాలు
- కిచెన్‌లో వాడే వస్తువులు
- క్లే ఐరన్
- కాపర్
- సోయా ఫైబర్, సోయా ప్రోటీన్
- కమర్షియల్ వాహనాల విడిభాగాలు
- స్కిమ్డ్ మిల్క్
- వాల్ ఫ్యాన్స్
- టేబుల్‌వేర్
ధరలు తగ్గేవి ఇవే..
- ఎలక్ట్రిక్ వాహనాలు
- మొబైల్ ఫోన్ల విడిభాగాలు
- ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
Published date : 01 Feb 2020 04:16PM