ఢిల్లీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం
Sakshi Education
మహిళల భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం’ అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఇకపై ఢిల్లీలోని మహిళలు డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చు. భాయ్ దూజ్‌ను పురస్కరించుకుని ఈ పథకాన్ని అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ, క్లస్టర్ బస్సులు ఎక్కే మహిళలకు రూ .10 ముఖ విలువ కలిగిన పింక్ టికెట్లు ఇస్తారు. ఇందుకు మహిళల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. పింక్ టికెట్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్‌కు చెల్లిస్తుంది.
మరోవైపు మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉచిత రవాణా పథకాన్ని త్వరలో వృద్ధులకు, విద్యార్థులకు వర్తింపజేస్తామని ప్రకటించారు.

Published date : 30 Oct 2019 05:37PM