ఢిల్లీలో కరెంట్ ఫ్రీ పథకం
Sakshi Education
ఢిల్లీలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉన్న ప్రజలు ఇకపై కరెంట్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 1న ప్రకటించారు.
201 నుంచి 400 యూనిట్ల వినియోగం ఉన్న వాళ్లు సగం విద్యుత్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కోసం ఢిల్లీ సర్కారు ఏటా రూ.2వేల కోట్లు భరించనుంది. 2020 ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Published date : 02 Aug 2019 05:29PM