ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా రియాన్ హ్యారిస్
Sakshi Education
2020 ఏడాది ఐపీఎల్‌లో తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బౌలర్ రియాన్ హ్యారిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నియమించింది.
‘ఐపీఎల్‌లో మళ్లీ భాగం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆస్ట్రేలియా తరఫున 27 టెస్టులు, 21 వన్డేలు, 3 టి20లు ఆడిన హ్యారిస్ తెలిపాడు. గత రెండు సీజన్ లకు ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్ వ్యక్తిగత కారణాలతో 2020 ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో హ్యారిస్‌ను తీసుకున్నారు. 2009 ఐపీఎల్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ జట్టులో హ్యారిస్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా హ్యారిస్ గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో పాటు ఆసీస్ జట్టుకు, బిగ్‌బాష్ లీగ్ జట్టు బ్రిస్బేన్ హీట్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : ఆస్ట్రేలియా మాజీ బౌలర్ రియాన్ హ్యారిస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : ఆస్ట్రేలియా మాజీ బౌలర్ రియాన్ హ్యారిస్
Published date : 26 Aug 2020 04:48PM