Skip to main content

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరోసారి ఘన విజయం సాధించింది.
Current Affairsఫిబ్రవరి 11న వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 53.57 శాతం, బీజేపీకి 38.51 శాతం, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు లభించాయి. 2015 ఎన్నికల్లో ఆప్ 54.34 శాతం ఓట్లు సాధించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్‌పై గెలుపొందారు.

మూడోసారి సీఎం పీఠంపై..
తాజాఎన్నికల్లో ఘన విజయంతో మూడోసారి సీఎం కుర్చీపై కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. తొలిసారి 2013 డిసెంబర్ 28న కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండి 2014, ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలుపొందింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఆమ్ ఆద్మీ పార్టీ
Published date : 12 Feb 2020 05:56PM

Photo Stories