Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 9th కరెంట్ అఫైర్స్
Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు
గుజరాత్‌లో కమలం పార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపడుతూ 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను సొంతం చేసుకుంది. నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించింది. తద్వారా 1985లో మాధవ్‌సింగ్ సోలంకీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. 2002లో సీఎంగా మోదీ నేతృత్వంలో సాధించిన 127 సీట్ల స్వీయ రికార్డునూ మెరుగు పరుచుకుంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు నెగ్గిన పార్టీగానూ రికార్డు సృష్టించింది. 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం! తద్వారా పశ్చిమబెంగాల్లో సీపీఎం కూటమి సాధించిన ఏడు వరుస విజయాల రికార్డును బీజేపీ సమం చేసింది. కాంగ్రెస్ కేవలం 17 సీట్లతో రాష్ట ఎన్నికల చరిత్రలో అత్యంత ఘోరమైన పరాజయం చవిచూసింది. ఒక్క చాన్సంటూ కేజ్రీవాల్ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆప్‌కు దక్కింది ఐదు స్థానాలే!
ఆద్యంతమూ జైత్రయాత్రే...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా తలపడ్డాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ మొదలైంది. మొదటినుంచీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. పార్టీకి అన్ని వర్గాల నుంచీ సంపూర్ణ మద్దతు లభించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ 77 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగా చేతులెత్తేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఈసారి జోడో యాత్ర కారణంగా దూరంగా ఉండటం, ప్రియాంక కూడా హిమాచల్‌తో పోలిస్తే గుజరాత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీ అవకాశాలను మరింతగా దెబ్బ తీశాయి. పులిమీట పుట్రలా ఆప్ కూడా హస్తం పార్టీని బాగా దెబ్బ తీసింది. ఆప్, మజ్లిస్ కలిసి మైనారిటీ ఓట్లను కూడా చీల్చడం బీజేపీకి మరింత కలిసొచ్చింది. ఆప్‌కు కూడా ఘోర పరాజయమే మూటగట్టుకుంది. పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాఢ్వీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు తదితరులంతా ఓటమి పాలయ్యారు. 2017లో దెబ్బ తీసిన పాటిదార్ల ఉద్యమం, జీఎస్టీపై వ్యాపారుల కన్నెర్ర వంటి సమస్యలేవీ లేకపోవడంతో ఈసారి బీజేపీ జైత్రయాత్ర నిరి్నరోధంగా కొనసాగింది. ఘనవిజయం ఖాయం కావడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలకు తెర తీశారు.
Vijayasai Reddy: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
మళ్లీ భూపేంద్రే సీఎం
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (60) అహ్మదాబాద్‌లోని ఘాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సీఎంగా ఆయనే కొనసాగనున్నారు. డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గెలిచిన ప్రముఖులు
☛ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజారిటీతో గెలిచారు.
☛ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జామ్‌నగర్ నార్త్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెల్చారు.
☛ పటీదార్ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అర్బన్ వీరమ్‌గ్రామ్ స్థానంనుంచి ఆప్ అభ్యర్థిపై గెలిచారు.
☛ వదగామ్ (ఎస్సీ) స్థానంలో గతంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.
☛ హార్దిక్ మాజీ సన్నిహితుడు, పటీదార్ నేత అల్పేశ్ కథిరియా వరఛా రోడ్ (సూరత్) స్థానంలో విజయఢంకా మోగించారు.
☛ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ సైతం గెలిచారు.
ఓడిన ప్రముఖులు
☛ గుజరాత్ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కటర్‌గామ్‌లో ఓడారు.
☛ ఆప్ సీఎం అభ్యర్థి ఎసుదాన్ గాఢ్వీ ఖంభలియా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
☛ ప్రాథమిక, యువజన విద్యాశాఖ సహాయ మంత్రి కీర్తిసిన్హా వాఘేలా, ఏడుగురు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు.
☛ ఇక హిమాచల్‌లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగిన ఆశాకుమారి, రామ్‌లాల్ ఠాకూర్, కౌల్‌సింగ్ ముగ్గురూ ఓటమి చవిచూశారు!
Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
Assembly Elections: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి 40, బీజేపీకి 25 స్థానాలు
హిమాచల్ ప్రదేశ్‌లో పాత సంప్రదాయమే పునరావృతమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం 1985 నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది. అధికార బీజేపీ పరాజయం పాలయ్యింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 40, బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకున్నాయి. ముగ్గురు స్వతంత్ర సభ్యులు నెగ్గారు. 67 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓడిపోయారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. గుజరాత్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో హిమాచల్‌లో ఈ విజయం హస్తం పారీ్టకి భారీ ఊరటనిచ్చింది.
ఆమ్ ఆద్మీకి 1.10 శాతం ఓట్లు
హిమాచల్‌లో బీజేపీ ఇచ్చిన ‘రాజ్ నహీ.. రివాజ్ బద్లేగా’ నినాదం పెద్దగా పనిచేయలేదు. ప్రభుత్వాన్ని కాదు, సంప్రదాయాన్ని మార్చాలని బీజేపీ చెప్పిన మాటలను జనం పట్టించుకోలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 43.9 శాతం ఓట్లు సాధించగా, బీజేపీ 43 శాతం ఓట్లు సాధించింది. రెండు పార్టీల నడుమ ఓట్ల తేడా ఒక శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు 12 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్లలో తేడా 1,000 లోపే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జైరామ్ ఠాకూర్ సెరాజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేత్‌రామ్‌పై 38,183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 1.10 శాతం ఓట్లు లభించాయి. 11 సీట్లలో పోటీకి దిగిన సీపీఎంకు 0.66 శాతం ఓట్లు దక్కాయి. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థులు 10.39 శాతం ఓట్లు సాధించారు.
Russian oil: బ్యారెల్@60 డాలర్లు
Same Sex Marriage: అమెరికాలో స్వలింగ వివాహాలకు ఓకే
అగ్రరాజ్యం అమెరికాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే ప్రక్రియ ఆరంభమైంది. సంబంధిత బిల్లుకు అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ డిసెంబర్ 8న తుది ఆమోదం తెలియజేసింది. బిల్లుకు మద్దతుగా 258 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 169 మంది ఓటు వేశారు. మొత్తం డెమొక్రాట్లతోపాటు 39 మంది ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. మిగతా 169 మంది వ్యతిరేకించారు. ‘రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్’ అని పిలుస్తున్న ఈ బిల్లు గత నెలలోనే ఎగువ సభ అయిన సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు దిగువ సభ సైతం ఆమోదించడంతో ఇక అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. స్వలింగ వివాహాల బిల్లుకు ఆధ్యాత్మిక సంస్థలు మద్దతు తెలిపాయి.
Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
Impeachment: పెరూలో అధ్యక్షుడి అభిశంసన, అరెస్టు
రాజకీయ సంక్షోభానికి నెలవైన దక్షిణ అమెరికా దేశం పెరూ పాలనా పగ్గాలు హఠాత్తుగా చేతులు మారాయి. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని, పార్లమెంట్‌ను రద్దుచేయబోతున్నట్లు, దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి రాబోతోందని ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిల్లోను ఆ దేశ పార్లమెంట్ సభ్యులు వెనువెంటనే అభిశంసనతోపాటు అధ్యక్ష పీఠం నుంచి తప్పించారు. ఆయన అరెస్ట్, నిర్బంధం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఉపాధ్యక్షురాలు డినా బొలౌర్టే.. అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు.
Brittney Griner: బ్రిట్నీ గ్రినర్‌ను విడుదల చేసిన రష్యా
అమెరికా, రష్యాలు ఖైదీల పరస్పర విడుదల ఒప్పందం కింద అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రినర్‌ను రష్యా విడుదల చేసింది. బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను అమెరికా–రష్యాకు అప్పగించింది. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన గ్రినర్‌ను రష్యా పర్యటనలో ఉండగా మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు. శిక్షను ఖరారు చేసి జైలుకు పంపారు. ఆమెకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా బైడెన్ సర్కా రు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఖైదీల పరస్పర విడుదలకు రష్యాతో బేరసారాలు కొనసాగించింది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అబుదాబిలో గ్రినర్ ను అప్పగించి, విక్టర్ బౌట్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
Collegium System: కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు
ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ అనేది మన దేశ చట్టమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. తాము నిర్దేశించిన ఏ చట్టమైనా భాగస్వామ్యపక్షాలను కలిపి ఉంచుతుందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థను కచ్చితంగా అందరూ అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించకుండా జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషనల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 8న విచారణ చేపట్టింది. కొలీజియంపై కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్
పార్టీ పట్ల అంకితభావం, కష్టించే తత్వం భూపేంద్ర పటేల్‌ను మున్సిపాలిటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేర్చాయి. గుజరాత్ శానససభ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. గుజరాత్‌లో ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రిని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. విజయ్ రూపానీ స్థానంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర వైపు మొగ్గుచూపింది. అధిష్టానం అంచనాలకు తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించారు.
New Zealand: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు
2017లో రికార్డు స్థాయి మెజార్టీ
భూపేంద్రబాయ్ పటేల్ అలియాస్ భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. 1982 ఏప్రిల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. తొలుత అహ్మదాబాద్ జిల్లాలోని మేమ్‌నగర్ మున్సిపాలిటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. రెండు సార్లు అదే మున్సిపాలిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2010 నుంచి 2015 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(ఏయూడీఏ) చైర్మన్‌గా సేవలందించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాందీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఘట్లోడియా శాసనసభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఏకంగా 1.17 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. 2021 సెప్టెంబర్ 13న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన(2022) అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల మెజార్టీతో నెగ్గడం గమనార్హం.
Shenu Agarwal: అశోక్ లేలాండ్ ఎండీగా శేణు అగర్వాల్
అశోక్ లేలాండ్ నూతన ఎండీ, సీఈవోగా శేణు అగర్వాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఎస్కార్ట్స్ కుబోటా ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్–10 వాణిజ్య వాహన కంపెనీల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా సాంకేతికత అభివృద్ధి, వృద్ధి, భవిష్యత్తు వ్యూహాన్ని అగర్వాల్ ముందుండి నడిపిస్తారని అశోక్ లేలాండ్ తెలిపింది. నాయకుడిగా నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను ఆయన కలిగి ఉన్నారని, అనేక విభాగాలలో, విభిన్న సామర్థ్యాలలో ఆయనకు పనిచేసిన అనుభవం ఉందని వివరించింది.
Major Disasters In India : భారతదేశ చరిత్రలో జరిగిన పెను విషాదాలు ఇవే..
Adani Stocks: సంపద సృష్టిలో పోటాపోటీ.. అదానీ గ్రూప్ కంపెనీల హవా
సంపద సృష్టిలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. వార్షికంగా చూస్తే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు అగ్రభాగానికి చేరగా.. ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) గత ఐదేళ్లలో అన్ని రికార్డులనూ అధిగమిస్తూ లీడర్‌గా నిలిచింది. సంపద సృష్టిపై బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన 27వ వార్షిక నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఈ ఏడాది దుమ్మురేపాయి.
Reliance Industries: విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్‌వన్
టాప్–100 ఇలా..: గత ఐదేళ్లలో టాప్–100 కంపెనీలు మొత్తం రూ.92.2 లక్షల కోట్ల సంపదను జమ చేసుకున్నాయి. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆర్‌ఐఎల్ అతిపెద్ద వెల్త్ క్రియేటర్‌గా నిలిచింది. అయితే 2022లో అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ ఆస్తుల కొనుగోలు, కొత్త రంగాలలోకి ప్రవేశించడం వంటి అంశాలతో వెలుగులో నిలిచాయి. వెరసి 2022లో గౌతమ్ అదానీ 155.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే రెండో ధనవంతుడిగా రికార్డు సాధించారు. సెప్టెంబర్ 16కల్లా ఫోర్బ్స్ రూపొందించిన రియల్ టైమ్ జాబితా ఇది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలలో 75 శాతం చొప్పున వాటా కలిగిన గౌతమ్ అదానీ 2022లో సెప్టెంబర్‌కల్లా ఏకంగా 70 బిలియన్ డాలర్ల సంపదను జమ చేసుకున్నారు. గ్రూప్ కంపెనీలు అదానీ టోటల్ గ్యాస్(37 శాతం), గ్రీన్ ఎనర్జీ(61 %) ఫోర్బ్స్(65 %)లోనూ వాటాలు కలిగి ఉండటం ఇందుకు సహకరించింది. ఇదే సమయంలో ముకేశ్ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 8వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 253.5 బిలియన్ డాలర్ల సంపదతో ఎలక్ట్రిక్ కార్ల(టెస్లా) దిగ్గజం ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఆవిర్భవించారు.
Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొలగింపు.. ఎందుకంట..?!
ఐదేళ్ల కాలంలో..: 2017–22 కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్‌మిషన్, ఎంటర్‌ప్రైజెస్ అత్యంత వేగంగా నిలకడగా ఎదిగిన భారీ కంపెనీలుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే ఈ కాలంలో టెక్నాలజీ, ఫైనాన్షియల్స్ తొలి రెండు ర్యాంకులను సాధించాయి. సంపద సృష్టిలో టాప్–100 కంపెనీలను, మార్కెట్ విలువల్లో మార్పులను నివేదిక పరిగణించింది. దీనిలో భాగంగా విలీనాలు, విడదీతలు, ఈక్విటీ జారీ, బైబ్యాక్ తదితర కార్పొరేట్ అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంది. ఈ ఐదేళ్లలో నాలుగేళ్లపాటు ఆర్‌ఐఎల్ అత్యధిక సంపదను సృష్టించిన దిగ్గజంగా ఆవిర్భవించింది. వెర సి ఐదేళ్లకుగాను టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ జాబితాలో టాప్–5లో నిలిచాయి. కాగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ గత ఐదేళ్లలో నిలకడైన సంపద సృష్టికి నిదర్శనంగా నిలిచింది.