Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 7th కరెంట్ అఫైర్స్
Indonesia: సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష
సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారుచేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును డిసెంబర్ 6వ తేదీ ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదుచేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు.
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం
International Year Of Millets: చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 డిసెంబర్ 6వ తేదీ అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్‌ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు.
726 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్‌లో నోటిఫికేషన్..? పరీక్షావిధానం ఇదే..
PTI Chief: ఇమ్రాన్ ఖాన్‌ను తొలగింపు ప్రక్రియ షురూ!
పాకిస్తాన్ తెహ్రాక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్ష పదవి నుంచి మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించే ప్రక్రియను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రారంభించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌పై ఇప్పటికే అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను పక్కనపెట్టేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇమ్రాన్‌కు డిసెంబర్ 6న నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 13న ఆయన వివరణను ఎన్నికల సంఘం తెలుసుకోనుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ విదేశాల్లో స్వీకరించిన ఖరీదైన వస్తువులను, కానుకలను నిబంధనల ప్రకారం తోషఖానాకు తరలించారు. అవే వస్తువులను తోషఖానా నుంచి తక్కువ ధరకు కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
UNO: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే!
పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు డిసెంబర్ 5న విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది.
Part Time Jobs: చదువుతోపాటు సంపాదన!
Aditya Mittal: భారత చెస్ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్‌లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
Ranji Trophy: రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు
భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు మహిళా అంపైర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత క్రికెట్‌లో ఇది కొత్త మలుపు కానుందని బోర్డు అభిప్రాయ పడింది. వ్రిందా రాఠి (ముంబై), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (ఢిల్లీ)లకు ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 13న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లకు వీరు అంపైర్లుగా వ్యవహరిస్తారు. 32 ఏళ్ల వ్రిందా ముంబైలో చిన్న స్థాయి క్లబ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెట్టి బీసీసీఐ అంపైర్‌గా ఎదగగా, 43 ఏళ్ల గాయత్రి బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై 2019 నుంచి అంపైరింగ్ చేస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన 36 ఏళ్ల జనని క్రికెట్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలి అంపైరింగ్ వైపు వెళ్లింది.
Nobel Prize: నోబెల్ పురస్కారాలు - 2022
Hrishikesh Kanitkar: మహిళల టి20 జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్
ఇంకో రెండు నెలల్లోనే దక్షిణాఫ్రికాలో మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఇలాంటి తరుణంలో భారత మహిళల జట్టు హెడ్ కోచ్ రమేశ్ పొవార్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి బదిలీ చేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు.. ఇంకెవరినీ హెడ్ కోచ్‌గా నియమించలేదు. భారత మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్‌ను మాత్రం బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ‘బెంగళూరులోని ఎన్‌సీఏకు పొవార్‌ను బదిలీ చేశాం. అకాడమీ డైరెక్టర్ లక్ష్మణ్ బృందంలో పురుషుల క్రికెట్ కోసం అతను పనిచేస్తాడు. బోర్డు పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ తెలిపింది.
Spotlight Award: ఆర్‌ఆర్‌ఆర్‌కు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్
హాలీవుడ్ గ్రౌండ్‌లో ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) సినిమా సౌండ్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ వారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును సాధించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ జ్యూరీ స్పాట్‌లైట్ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ప్రకటించింది. అలాగే అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలిచింది. ఇక ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ కింద ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూనిట్ ఆస్కార్ అకాడమీకి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న రిలీజై, ఘనవిజయం సాధించింది. కాగా 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’కు దక్కుతుందా? లేదా అనేది జనవరిలో నామినేషన్స్ ప్రకటన అప్పుడు తెలుస్తుంది. అవార్డుల వేడుక మార్చి12న జరగనుంది.
Filmfare Awards 2022 : 'పుష్ప' తగ్గేదేలె.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో క్లీన్ స్వీప్
World Bank: భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఇందుకు భిన్నంగా డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకుంది.
వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. నిజానికి అక్టోబర్‌లోనే బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం భారత్ 2022–23 వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొంది. దీనితోపాటు రెండవ (సెప్టెంబర్) త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలకు మించి 6.3 శాతంగా నమోదుకావడమూ తమ తాజా ఎగువముఖ సవరణకు కారణమని వివరించింది. భారత్ ఎకానమీ మొదటి త్రైమాసికంలో 13.5 శాతం పురోగతి సాధించిన సంగతి తెలిసిందే.
‘నావిగేటింగ్ ది స్ట్రోమ్’ (తుపానులో ప్రయాణం) శీర్షికన ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు..
Digital Rupee: డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి
☛ క్షీణిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం చూపుతాయి. అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోలిస్తే భారత్ ఎకానమీ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనగలుగుతోంది.
☛ మంచి డిమాండ్ వాతావరణంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తోంది.
☛ అయితే అంతర్జాతీయ పరిణామాలపై నిరంతర నిఘా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల కఠిన ద్రవ్య పరపతి విధానాలు, రూపాయి పతనం, కమోడిటీ ధరల తీవ్రత, ఆయా అంశాల నేపథ్యంలో కరెంట్ అకౌంట్ సవాళ్లు దేశం ఎదుర్కొనే వీలుంది. దీనితోపాటు ఎగుమతుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి అవసరం.
☛ 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు 6.6%గా నమోదుకావచ్చు.
☛ భారీ పన్ను వసూళ్ల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2022–23లో లక్ష్యాల మేరకు జీడీజీలో 6.4%కి (విలువలో రూ.16.61 లక్షల కోట్లు) కట్టడి కావచ్చు.
ఫిచ్ 7% అంచనా యథాతథం
కాగా, ఫిచ్ రేటింగ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను యథాతథంగా 7 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది.
➤ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం : RBI గవర్నర్ శక్తికాంతదాస్
2022–23పై పలు సంస్థల అంచనాలు(%ల్లో)
సంస్థ | ప్రస్తుత | తొలి |
ఐఎంఎఫ్ | 6.8 | 7.4 |
ఫిక్కీ | 7.0 | 7.8 |
సిటీగ్రూప్ | 6.7 | 8.0 |
గోల్డ్‌మన్ శాక్స్ | 7.0 | 7.2 |
ఆర్‌బీఐ | 7.0 | 7.2 |
ఏడీబీ | 7.0 | 7.2 |
ఎస్‌బీఐ | 6.8 | 7.5 |
మూడీస్ | 7.6 | –– |
క్రిసిల్ | 7.3 | –– |
ఇండియా రేటింగ్స్ | 6.9 | –– |
ఓఈసీడీ | 6.9 | –– |
ఇక్రా | 7.2 | –– |