Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 22nd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 22nd 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Omicron Bf-7 Variant: దేశంలో కరోనా బీఎఫ్‌.7 వేరియంట్ 
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఎఫ్‌.7 పాజిటివ్‌ కేసులు భారత్‌లోనూ వెలుగుచూశాయి. దేశంలో ఇప్పటిదాకా 3 కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ డిసెంబ‌ర్ 21న‌ ప్రకటించింది.  భారత్‌లో తొలి బీఎఫ్‌.7 కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. అహ్మదాబాద్‌లోని గోటా ఏరియాలో ఉండే వ్యక్తి, గుజరాత్‌లోని వడోదరలో అమెరికా నుంచి వ‌చ్చిన‌ ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు సైతం ఇదే సబ్‌వేరియంట్‌ సోకింది. ఒడిశా రాష్ట్రంలోనూ ఒక బీఎఫ్‌.7 కేసు నమోదైంది. బీఏ.5 అని పిలిచే ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్‌ బీఎఫ్‌.7. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని ప్రధాన లక్షణం. బలమైన ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుంది. కరోనా టీకా తీసుకున్నవారిని సైతం బీఎఫ్‌.7 ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ముప్పు మరింత ఎక్కువ. 

Covid Cases: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం.. ఆస్పత్రుల్లో శవాల గుట్టలు

భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
బీఎఫ్‌.7.. కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్‌ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్‌లోనే బిఎఫ్‌.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్‌ వేరియెంట్‌ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చినవారు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో జనవరిలో థర్డ్‌ వేవ్‌ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బిఏ.1, బీఏ.2 సబ్‌ వేరియెంట్‌లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది. వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని  కోవిడ్‌–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్‌ మాజీ చీఫ్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ చెప్పారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)
2021 ఏప్రిల్‌–మే మధ్యలో డెల్టా వేరియెంట్‌తో భారత్‌లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్‌లో బీఎఫ్‌.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్‌ అగర్వాల్‌ చెబుతున్నారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్‌.7తో భారత్‌కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్‌ వేరియెంట్‌ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. 

Covid Death: వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?

ICC Test Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో అక్షర్‌ పటేల్‌ 
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కెరీర్‌ బెస్ట్‌ 18వ ర్యాంక్‌ను అందుకున్నాడు.  తాజా ర్యాంకింగ్స్‌లో అక్షర్‌ 20 స్థానాలు పురోగతి సాధించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో అక్షర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, అశ్విన్‌ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో పుజారా, గిల్‌ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్‌ల్లో నిలిచారు. 

ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం

T20I: టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు 
మ‌లేషియా వేదిక‌గా సింగ‌పూర్‌, బ‌హ్రెయిన్ జ‌ట్ల మ‌ద్య జరిగిన టీ20 మ్యాచ్‌లో బహ్రెయిన్‌కు చెందిన రిజ్వాన్ బ‌ట్ కేవ‌లం ఆరు బంతుల్లో 5 వికెట్లు తీసి రికార్డు నెల‌కొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఆరు బంతుల్లో 5 వికెట్లు తీయ‌డం ఇదే మొద‌టిసారి. రిజ్వాన్‌ వేసిన 18వ ఓవర్లో రిజ్వాన్ మూడు, నాలుగవ, ఆరో బంతుల్లో వికెట్లు తీయగా, 20వ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

SA20 2023: ఎస్‌ఏ టి20 లీగ్ ప్రైజ్‌మనీ రూ.33.5 కోట్లు

Cryptocurrency: క్రిప్టో కరెన్సీలు పెరిగిపోతే.. ఆర్థిక సంక్షోభమే!
ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలు పెరగడానికి అనుమతించడం తదుపరి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్ డిసెంబ‌ర్ 21న‌ హెచ్చరించారు. ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం–సెంట్రల్‌ బ్యాంక్‌ మధ్య ‘‘పటిష్ట సమన్వయ విధానం’’ ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ వివరించారు. ఆయా అంశాలపై బిజినెస్‌ స్టాండెర్డ్‌ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్‌ సమ్మిట్‌ 2022లో కార్యక్రమంలో శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ.. బిట్‌కాయిన్‌ వంటి ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధం కోసం ఆర్‌బీఐ చేస్తున్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అటువంటి సాధనాలకు అంతర్లీన విలువ లేదని, అలాగే అవి స్వభావరీత్యా ఊహాజనితమైనవని చెప్పారు.

Gold ATM: దేశంలో తొలి గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

‘‘క్రిప్టో కరెన్సీ సాధనలు 100 శాతం ఊహాజనిత కార్యకలాపాలకు సంబంధించినవి. వీటిని నిషేధించాలన్న అభిప్రాయాన్ని నేను ఇప్పటికీ కలిగి ఉన్నాను. మీరు దీన్ని నియంత్రించి (చట్టబద్ధత ద్వారా) దానిని పెంచడానికి అనుమతిస్తే, తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల నుంచి వస్తుంది. దయచేసి నా మాటలను గుర్తించండి’’ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వాలకు తీవ్ర నష్టం ఉంటుందని తాను భావిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల విలువ 190 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయిన విషయాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మార్కెట్‌కు అంతర్లీన విలువ లేదని స్పష్టం చేశారు.  

Weekly Current Affairs (Economy) క్విజ్ (18-24 నవంబర్ 2022)

డిజిటల్‌ మనీపై ఏమన్నారంటే.. 
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై గవర్నర్‌ మాట్లాడుతూ..  డిజిటల్‌ మనీదే భవిష్యత్తు అన్నారు. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ వైపు దృష్టి పెట్టిందన్న విమర్శల్లో అర్థం లేదన్నారు. అలాంటి భయాలు సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు, నిర్ణయాలను ప్రేరేపించబోవని ఉద్ఘాటించారు. సీబీడీసీ, యూపీఐ వాలెట్‌లు వేర్వేరని పేర్కొంటూ, 24 గంటల్లో డబ్బును తిరిగి ఇచ్చే సామర్థ్యం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు  డిజిటల్‌ కరెన్సీ విధానంలో ఉన్నట్లు గవర్నర్‌ తెలిపారు.  
ధరలపై ఇలా..
ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం–సెంట్రల్‌ బ్యాంక్‌ మధ్య ‘‘పటిష్ట సమన్వయ విధానం’’ ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అన్నారు. ధరల స్పీడ్‌ కట్టడిపై ఆర్‌బీఐ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తోందో, కేంద్రం కూడా ఆదే స్థాయిలో ఈ అంశంపై దృష్టి సారించిందని అన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది. అయితే నవంబర్‌కు ముందు గడచిన 9 నెలల కాలంలో ఈ స్థాయిపై రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగింది. దీనికి కారణాల ఏమిటన్న అంశంపై కొద్ది వారాల క్రితమే కేంద్రానికి ఆర్‌బీఐ ఒక నివేదిక సమర్పించింది.

ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం–ఆర్‌బీఐ సమన్వయ చర్యలను వివరిస్తూ,  ‘‘ఆర్‌బీఐ రేట్ల పెంపు, ద్రవ్య విధానాలు, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విధానాల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో కేంద్రం పెట్రోల్‌ లేదా డీజిల్‌పై పన్నులను తగ్గిస్తోంది.  దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలపై సుంకాలు తగ్గించడం వంటి పలు సరఫరా వైపు సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన విధాన రూపకల్పనకు ప్రస్తుత ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ (2023–24) దృష్టి పెడుతుంది’’ అని గవర్నర్‌ వివరించారు. అంతర్జాతీయ అంశాలు కొంత అనిశ్చితికి గురిచేస్తున్నా, దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత పటిష్టంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. రుణ వృద్ధి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

GST: రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం

Nirmala Sitharaman: ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే ఉన్నాం.. మంత్రి సీతారామన్‌
అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉందని, ధరల భారం పెరగకుండా చూస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి రాకతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా, పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన లక్ష్యిత విధానాలు తోడ్పడినట్టు చెప్పారు. రాజ్యసభలో మధ్యంతర నిధుల బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి  నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్టు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రూ.3.25 లక్షల కోట్లను వ్యయం చేసేందుకు అవకాశం ఉంటుంది. బిల్లును లోక్‌సభ సైతం ఆమోదించడం గమనార్హం.

పన్నుల వసూళ్లు బలంగా ఉన్నాయని వివరిస్తూ.. ప్రభుత్వం ఖర్చు చేసే రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయాలకు తగిన వనరులున్నాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2022–23 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం 6.4 శాతంగా పేర్కొనడం గమనార్హం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, ఇతర అనుకూల విధానాలతో ప్రైవేటు మూలధన నిధుల వ్యయాలు పుంజుకుంటున్నాయని మంత్రి సీతారామన్‌ చెప్పారు. బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2022 మార్చి నాటికి, ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గినట్టు సభకు తెలిపారు. మధ్యంతర నిధుల డిమాండ్లు అన్నవి ఆహార భద్రత, ఎరువుల సబ్సిడీల కోసం, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు నిచ్చేందుకేనని వివరించారు.

Nirmala Sitharaman: చెలామణిలో ఉన్న నోట్ల విలువ.. రూ.31.92 లక్షల కోట్లు 

Indira Gandhi Peace Award: వైద్య సిబ్బందికి ఇందిరా శాంతి బహుమతి 
ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు స్థాపించిన ‘ఇందిరాగాంధీ ఫ్రైజ్‌ ఫర్‌ పీస్, డిసార్మమెంట్, డెవలప్‌మెంట్‌–2022’ను దేశంలోని మొత్తం వైద్య సిబ్బందికి ప్రకటించారు. 2020, 2021లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో అందించిన సేవలను గాను ఈ బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద రూ.కోటి నగదు, ఒక ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేస్తారు.    

Weekly Current Affairs (Awards) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Patriot Missiles: ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు
ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్‌ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్‌ క్షిపణులు, ఉక్రెయిన్‌ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్‌ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిసెంబ‌ర్ 21న‌ అమెరికాకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్‌స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి.

Ukraine war: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీ ప్రాణనష్టం

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ యుద్ధం ‘విషాదం’: పుతిన్‌  
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ‘ఓ విషాదం’గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభివర్ణించారు! ‘‘ఉక్రెయిన్‌ ప్రజలను మేమెప్పుడూ మా సోదరులుగానే చూశాం.. ఇప్పటికీ అలాగే చూస్తున్నాం. ఇప్పుడక్కడ జరుగుతున్నది కచ్చితంగా విషాదమే’’ అని అంగీకరించారు. ఏకపక్షంగా కయ్యానికి కాలు దువ్వి 9 నెలలుగా ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తున్న ఆయన డిసెంబ‌ర్ 21న‌ అత్యున్నత సైనికాధికారులతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలే తప్ప తాము కాదని చెప్పుకొచ్చారు. లక్ష్యాలు సాధించేదాకా ముందుకే వెళ్లి తీరతామని పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యా సైన్యం సంఖ్యను ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ ప్రకటించారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది స్వచ్ఛంద, కాంట్రాక్టు సైనికులుంటారన్నారు. ఫిన్లండ్, స్వీడన్‌లకు చెక్‌ పెట్టేందుకు పశ్చిమ రష్యాలో నూతన సైనిక విభాగాలను నెలకొల్పుతామని షొయిగూ ప్రకటించారు. 

2022 Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రదానం

Published date : 22 Dec 2022 06:14PM

Photo Stories