డ్రగ్స్ వినియోగంలో తొలి స్థానంలో ఉన్న నగరం?
Sakshi Education
జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం..
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రగ్స్ వినియోగంలో న్యూయార్క్‌కు తొలి స్థానం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ
ఎక్కడ : ప్రపంచంలో
- ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు.
- పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్‌సను వినియోగిస్తారు.
మూడో స్థానంలో ఢిల్లీ...
- డ్రగ్స్ వినియోగంలో భారత రాజధాని న్యూఢిల్లీ మూడో స్థానంలో, ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది.
- ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు.
- భారత్‌లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీబీ) గణాంకాలు తెలుపుతున్నాయి.
ర్యాంకు | నగరం | దేశం | ఏడాదికి డ్రగ్స్ వినియోగం |
1 | న్యూయార్క్ | అమెరికా | 70, 252 కిలోలు |
2 | కరాచీ | పాకిస్తాన్ | 38,056 కిలోలు |
3 | న్యూఢిల్లీ | భారత్ | 34,708 కిలోలు |
4 | లాస్ ఏంజిల్స్ | అమెరికా | 32,713 కిలోలు |
5 | కైరో | ఈజిప్ట్ | 29,565 కిలోలు |
6 | ముంబై | భారత్ | 29, 374 కిలోలు |
7 | లండన్ | ఇంగ్లండ్ | 28,485 కిలోలు |
8 | షికాగో | అమెరికా | 22,262 కిలోలు |
9 | మాస్కో | రష్యా | 20,747 కిలోలు |
10 | టొరంటొ | కెనడా | 20,638 కిలోలు |
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రగ్స్ వినియోగంలో న్యూయార్క్‌కు తొలి స్థానం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 01 Dec 2020 05:51PM