దక్షిణాసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ
దక్షిణాసియా దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు.
ఫేస్‌బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా
గూగుల్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్‌బుక్ తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్‌బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్‌బుక్ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది.
ఆస్ట్రేలియా రాజధాని: కాన్‌బెర్రా; కరెన్సీ: ఆస్టేలియన్ డాలర్
ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధానమంత్రి: స్కాట్ మోరిసన్