దక్షిణాఫ్రికా జట్టు హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్
Sakshi Education
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు(ప్రొటీస్ జట్టు) హెడ్ కోచ్‌గా మాజీ టెస్టు వికెట్ కీపర్ మార్క్ బౌచర్, అసిస్టెంట్ కోచ్‌గా ఇనోచ్ ఎన్‌వే, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు కోచ్‌గా మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ యాష్‌వెల్ ప్రిన్స్ నియమితులయ్యారు.
ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ తాత్కాలిక డెరైక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ డిసెంబర్ 14న వెల్లడించారు. మార్క్ బౌచర్ ప్రొటీస్ జట్టుకు 2023 వరకు కోచ్‌గా పనిచేస్తాడని పేర్కొన్నారు. బౌచర్ 147 టెస్టులు, 290 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కంటికి తీవ్ర గాయం కావడంతో అతను ఆటకు స్వస్తి పలికాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు(ప్రొటీస్ జట్టు) హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : మార్క్ బౌచర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు(ప్రొటీస్ జట్టు) హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : మార్క్ బౌచర్
Published date : 16 Dec 2019 05:36PM