Skip to main content

దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రమఫోసా ప్రమాణ స్వీకారం

దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా మే 25న ప్రమాణ స్వీకారం చేశారు.
2019, మే 8న జరిగిన సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన నూతన పార్లమెంటు ఆయనను మే 22న దేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ప్రజలచేత ఎన్నికై న పార్లమెంటు అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అధ్యక్ష పదవికి రమఫొసా నామినేషన్ ఒక్కటే దాఖలవడంతో పోటీ లేకుండా ఆయన ఎన్నికైనట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మోగెయింగ్ మోగెయింగ్ ప్రకటించారు.

దక్షిణాఫ్రికా నుంచి శ్వేతజాతి దుర్హంకార వలస పాలకులను పారదోలి, నల్లజాతీయుల చేతికి అధికార మార్పిడి సాఫీగా జరిగేలా చూడడంలో రమఫొసా కీలక పాత్ర పోషించారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో 2018 ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో, అధ్యక్ష బాధ్యతలను ఆయన తొలిసారి చేపట్టారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 25
ఎవరు : సిరిల్ రమఫోసా
Published date : 27 May 2019 06:00PM

Photo Stories