Skip to main content

డిసెంబర్ నుంచి గడపకే నాణ్యమైన బియ్యం

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని 2020, డిసెంబరు 1 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.
Current Affairs
వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రభుత్వం ఆరేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వనుంది. వారికి ప్రతి నెల రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది. ఇందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకం కింద 60 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం మొత్తం స్టార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు, డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు కలిపి ప్రభుత్వం రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది.

చదవండి: నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం

మంత్రివర్గం నిర్ణయాలు ఇలా...
  • ఏపీ ఆక్వాకల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం–2006 సరవరణల ఆర్డినెన్స్ కు ఆమోదం. తద్వారా సీడ్‌ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందుతుంది.
  • పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం–2020కి ఆమోదం.
  • విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు.
  • వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం.
  • పంచాయతీరాజ్‌ శాఖలో తొలిసారిగా 51 డివిజనల్‌ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, డిసెంబర్ 1 నుంచి గడపకే నాణ్యమైన బియ్యం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
Published date : 21 Aug 2020 12:51PM

Photo Stories