Skip to main content

డిసెంబర్ 3న వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం

వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం 2019, డిసెంబర్ 3న ప్రారంభం కానుంది.
ఈ మేరకు అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్‌లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్‌రోల్ అవుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: 2019, డిసెంబర్ 3న వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లించేందుకు
Published date : 29 Oct 2019 06:02PM

Photo Stories