Skip to main content

డిసెంబర్ 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2019, డిసెంబర్ 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 ప్రయోగం చేపట్టనుంది.
Current Affairsశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ48 ద్వారా రీశాట్-2బీఆర్1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ నవంబర్ 27న తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. అలాగే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు విజయవంతం అయ్యింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019, డిసెంబర్ 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 ప్రయోగం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రీశాట్-2బీఆర్1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టెందుకు
Published date : 29 Nov 2019 05:46PM

Photo Stories