దిశ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ దిశ(మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు) సవరణ బిల్లు-2020తోపాటు పలు కీలక బిల్లులకు డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది.
గతంలో ఆమోదించిన దిశ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లినప్పుడు కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో తాజా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాల నియంత్రణ, నిరోధానికి దిశ చట్టం తెచ్చారు. శాసనసభలో ఆమోదం పొందిన మరికొన్ని బిల్లులు...
- ఏపీ భూమి హక్కుల యాజమాన్య సవరణ బిల్లు(ఏపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్-2020)
- ఏపీ పురపాలక శాసనముల సవరణ బిల్లు(ఏపీ మున్సిపల్ లాస్ సవరణ)
- ఏపీ విద్యుత్ సుంకం సవరణ(ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్‌మెంట్) బిల్లు
డిసెంబర్ 2న శాసనసభ ఆమోదించిన బిల్లులు...
- రాష్ట్రంలో 10 వేల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం ఏపీ అసైన్‌డ భూముల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (రెండో సవరణ) బిల్లు.
- వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను విధింపు సవరణ బిల్లు.
- విలువ ఆధారిత పన్ను (మూడో సవరణ) బిల్లు.
- రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లు.
- పశువుల మేత (తయారీ, నాణ్యత, అమ్మకం, పంపిణీ క్రమబద్ధీకరణ) బిల్లు.
Published date : 04 Dec 2020 06:14PM