దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్
Sakshi Education
దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ న్యాయ విచారణ చేపడుతుందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్.ఎ. బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం డిసెంబర్ 12న ఆదేశాలు జారీచేసింది.
సిర్పుర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ బాల్డోట, సీబీఐ మాజీ డెరైక్టర్ డి.ఆర్.కార్తి కేయన్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ కమిషన్.. విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. అప్పటి వరకు ఏ ఇతర కోర్టులూ ఎన్‌కౌంటర్ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
ఎంక్వయిరీస్ యాక్ట్- 1951
దిశ నిందితులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్, ఎంకే శర్మ, మనోహర్‌లాల్ శర్మలు దాఖలు చేసిన మూడుపిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం.. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నందునే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్- 1951’ ద్వారా దఖలుపడిన అధికారాలన్నీ ఈ కమిషన్ కలిగి ఉంటుందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై న్యాయ విచారణకు

Published date : 13 Dec 2019 05:42PM