Skip to main content

దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది.
Current Affairsజస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా డిసెంబర్ 4న తెలంగాణ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది.

నోట్ : శంషాబాద్‌లో నవంబర్ 27న అత్యాచారం, దారుణ హత్యకు గురైన బాధితురాలి పేరును ‘జస్టిస్ ఫర్ దిశ’గా పిలవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ డిసెంబర్ 1న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెండోసారి ఫాస్ట్‌ట్రాక్..
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తెలంగాణ న్యాయ శాఖ
ఎందుకు : దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు
Published date : 05 Dec 2019 05:33PM

Photo Stories