డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ముసాయిదా రూపకల్పన
దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.
కుల్‌భూషణ్‌కు భారత్ లాయర్
మరణ శిక్ష ఎదుర్కొంటూ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు భారత్ అధికారులకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను 2020, సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. జాధవ్ కేసులో పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020ముసాయిదా రూపకల్పన
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్రరక్షణ శాఖ