డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతులు
2021 ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం(2021-22) బడ్జెట్ కాపీలను కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదం దృష్ట్యా ముద్రించడానికి బదులు ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వాలని జనవరి 11న నిర్ణయించింది. ఇలాంటి పరిణామం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే ప్రథమం.
తైవాన్‌తో స్వీయ ఆంక్షల్ని తొలగించిన అమెరికా
తైవాన్ దౌత్యవేత్తలు, అధికారులతో అమెరికా దౌత్యవేత్తలు, ఇతర అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వీయ అంతర్గత సంక్లిష్ట ఆంక్షలను తొలగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. తైవాన్ అమెరికాకు విశ్వసనీయమైన, అనధికార భాగస్వామి అని వ్యాఖ్యానించారు.
రవిశాస్త్రిపై పుస్తకం...
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి క్రికెట్ కెరీర్‌పై పుస్తకం రానుంది. 2021 ఏడాది వేసవిలో ఈ పుస్తకం ద్వారా తన క్రికెట్ జీవితం గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలను శాస్త్రి బయటపెట్టనున్నాడు. ఈ పుస్తకానికి సహ రచయితగా స్పోర్‌ట్స జర్నలిస్ట్ అయాజ్ మెమన్ వ్యవహరించనుండగా... హార్పర్ కోలిన్స్ ఇండియా పబ్లిషర్‌గా ఉండనుంది.