Skip to main content

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 2021-22 బ‌డ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
Current Affairs

మొత్తం 8,500 కిలోమీటర్ల కొత్త ప్రాజెక్టులు రానున్నాయ‌ని తెలిపారు. వీటి వల్ల రోడ్డు నిర్మాణ కంపెనీలకు ఎంతో మేలు జరగనుంది. మంత్రి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గత ఆర్థిక సంవత్సరంలో... కరోనా కారణంగా... రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు రోడ్లు, హైవేలు, రైల్వేలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెరగడం వల్ల... ఆర్థిక వ్యవస్థ మెరుగవ్వడంతోపాటూ... ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రధానంగా కేంద్రం ప్రజా రవాణా వ్యవస్థలో కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ముఖ్యంగా మెట్రో రైలు లైన్స్‌ని లింక్ చేస్తూ ప్రజా బస్సు సర్వీసులను పెంచబోతోంది. టైర్-2 సిటీల్లో ప్రజా రవాణా మరింత మెరుగవ్వబోతోంది. ఇందుకోసం కేంద్రం రూ.18,000 కోట్లు కేటాయించింది. ఫలితంగా నిరుద్యోగ యువతకు రోడ్డు రవాణా ప్రాజెక్టుల్లో మంచి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మెట్రో లైన్లకు లింక్ రోడ్లు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ ఫ్లో బాగా పెరిగి... ఎకానమీ బలపడేందుకు వీలు కానుంది.

బ‌డ్జెట్ ప్రసంగం-ముఖ్యాంశాలు

  • డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
  • 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
  • 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
  • ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం
  • 15 వేల పాఠశాలలు శక్తివంతం
  • కొండ ప్రాంతాలలో ఏకలవ్య పాఠ‌శాల‌ల కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
  • ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
  • లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు
Published date : 01 Feb 2021 01:04PM

Photo Stories