Skip to main content

దీర్ఘకాలంలో పటిష్టంగా భారత ఎకానమీ: ఐరాస

దక్షిణ, నైరుతి ఆసియా దేశాల్లో దీర్ఘకాలికంగా చూస్తే భారత ఎకానమీ అత్యంత పటిష్టమైనదిగా ఉండగలదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
Current Affairsకోవిడ్-19 పరిణామాల అనంతరం.. వృద్ధి కాస్త మందగించినా సానుకూలంగానే ఉండటం, భారీ స్థాయి మార్కెట్ కావడం తదితర అంశాల నేపథ్యంలో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగగలదని తెలిపింది. ‘2020/2021లో ఎఫ్‌డీఐ ధోరణులు - ఆసియా, పసిఫిక్ దేశాలపై అంచనాలు’ అనే నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

2018లో దక్షిణ, నైరుతి ఆసియా దేశాల్లోకి 67 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. 2019లో స్వల్పంగా 2 శాతం మేర తగ్గి 66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఐరాస నివేదిక తెలిపింది.
Published date : 30 Dec 2020 06:04PM

Photo Stories