డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది?
Sakshi Education
కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు, న్యాయవాది రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నామినేషన్ల ఉపసంహరణ గడవు అక్టోబర్ 17న ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్ 2021 ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : రోహన్ జైట్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : రోహన్ జైట్లీ
Published date : 19 Oct 2020 05:48PM