Skip to main content

డీఆర్‌డీవో ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మరో ఘన విజయాన్ని సాధించింది.
Current Affairs
లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ‘ట్యాంకు విధ్వంసక క్షిపణి’ని సెప్టెంబర్ 23న విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ కేకే పర్వతశ్రేణి ప్రాంతంలో ఏబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. లేజర్ కిరణాల ఆధారంగా పనిచేసే ట్యాంక్ విధ్వంసక క్షిపణి లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు వాటి కదలికలను గమనిస్తూ ప్రయాణిస్తుంది. మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. తాజా క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల సాయంతో ప్రయోగించేలా డీఆర్‌డీవో సిద్ధం చేసింది.

సంయుక్తంగా అభివృద్ధి...
డీఆర్‌డీవో పరీక్షించిన ట్యాంకు విధ్వంసక క్షిపణిని పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డెహ్రాడూన్)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా జి.సతీశ్‌రెడ్డి ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : అహ్మద్‌నగర్ కేకే పర్వతశ్రేణి ప్రాంతం, మహారాష్ట్ర
Published date : 24 Sep 2020 04:59PM

Photo Stories