Skip to main content

ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ పుస్తకావిష్కరణ

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్’ అనే పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు.
న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఈ పుస్తకం వచ్చినట్టు పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ

మాదిరిప్రశ్నలు
1. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై రచించిన ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్’ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
2. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
3. హో మంత్రి అమిత్ షా
4. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సమాధానం : 2

2. ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్‌సీక్వెన్సెస్, క్యూర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. వి.అనంత నాగేశ్వరన్
2. గుల్జార్ నటరాజన్
3. నిర్మలా సీతారామన్
4. రఘురాం రాజన్
సమాధానం : 1, 2
Published date : 11 Nov 2019 05:56PM

Photo Stories