ది నర్చరింగ్ నైబర్‌హుడ్స్ చాలెంజ్‌కు ఎంపికైన నగరాల సంఖ్య?
Sakshi Education
దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు వారి సంరక్షకుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తీసుకొచ్చిన ‘‘ది నర్చరింగ్ నైబర్‌హుడ్స్ చాలెంజ్’’కు 25 నగరాలు ఎంపికయ్యాయి.
అందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ నగరాలు ఉన్నాయి. ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు అన్ని స్మార్ట్ సిటీలు, అన్ని రాజధాని నగరాలు, ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలకు అవకాశం ఇవ్వగా...వచ్చిన దరఖాస్తుల్లో నుంచి 25 నగరాలను పైలట్ దశలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది నర్చరింగ్ నైబర్‌హుడ్స్ చాలెంజ్‌కు ఎంపికైన నగరాల సంఖ్య 25
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు వారి సంరక్షకుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి
Published date : 18 Mar 2021 06:01PM