Skip to main content

ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్లుకు ఆమోదం

‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020’కు రాజ్యసభ సెప్టెంబర్ 19న మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
Current Affairs
దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి 2020, జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 14న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు జరిగాయి. చివరిరోజైన సెప్టెంబర్ 23న కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు-2020కుఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు
Published date : 02 Oct 2020 10:59AM

Photo Stories