Skip to main content

డెన్మార్క్ ప్రధానితో భారత ప్రధాని సమావేశం

డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు.
Current Affairs
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని అన్నారు. సప్లయ్ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు.

3.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం...
అధికార గణాంకాల ప్రకారం.. భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016-2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్‌తో వర్చువల్ సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 29 Sep 2020 05:48PM

Photo Stories