Skip to main content

డెంగీ కేసుల్లో కర్ణాటకకు అగ్రస్థానం

డెంగీ కేసుల్లో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2019 ఏడాదిలో ఇప్పటివరకు 13,200 డెంగీ కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి.
డెంగీ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పరిశీలించడానికి అక్టోబర్ 25న హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం ఈ విషయాలను వెల్లడించింది. కేంద్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2019 ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. అందులో 58 మంది మరణించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డెంగీ కేసుల్లో కర్ణాటకకు అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం
ఎక్కడ : దేశంలో
Published date : 26 Oct 2019 05:46PM

Photo Stories