Skip to main content

డెల్టాపై కోవాగ్జిన్‌ ప్రభావం 65 శాతం: భారత్‌ బయోటెక్‌

కోవిడ్‌–19 వైరస్‌ వేరియంట్లపై భారత్‌ బయోటెక్‌కు అభివృద్ధి చేసిన ‘‘కోవాగ్జిన్‌’’ వ్యాక్సిన్‌ చూపే ప్రభావం మదింపు గణాంకాలను జూలై 3న కంపెనీ వెల్లడించింది.
Current Affairs

ఫేజ్‌ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్‌ టీకా సింప్టమాటిక్‌ కోవిడ్‌– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్‌ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్‌ సైడ్‌ ఎఫెక్టులు వస్తాయని పేర్కొంది. లక్షణాల్లేని కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని వివరించింది. సెకండ్‌ డోస్‌ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్‌ 3 ట్రయల్స్‌ను నిర్వహించారు.

Published date : 05 Jul 2021 05:21PM

Photo Stories