Skip to main content

దేశవ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 170 జిల్లాలు

దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్‌(రెడ్‌జోన్‌) జిల్లాలుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏప్రిల్ 15న రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది.
Current Affairsఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా జిల్లాలను హాట్‌స్పాట్‌ (రెడ్‌ జోన్‌), నాన్‌ హాట్‌స్పాట్‌ (ఆరెంజ్‌), నాన్‌ ఇన్ఫెక్టెడ్‌ (గ్రీన్‌ జోన్‌) జిల్లాలుగా వర్గీకరించింది. రెడ్‌జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్లో 207, మిగతావి గ్రీన్‌ జోన్లో ఉన్నట్టు తెలిపింది. రెడ్‌ జోన్‌ను రెండు రకాలుగా ఉపవర్గీకరణ చేసింది. విస్తృతి ఎక్కువగా ఉన్నవి 143 (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు, క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలుగా గుర్తించింది. రాష్ట్రాలు ఆయా జోన్లవారీగా నిర్దేశిత కార్యాచరణ ద్వారా వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలని సూచించింది. ఇకపై కూడా కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రాతిపదికన రెడ్‌ జోన్లను గుర్తించాలని కోరింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, 28 రోజుల్లో కొత్త కేసులు లేనిపక్షంలో గ్రీన్‌ జోన్‌కు మార్చాలని సూచించింది. కేస్‌ లోడ్, నాలుగు రోజుల్లో రెట్టింపు సంఖ్య నమోదైన జిల్లాలు తదితర అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించినట్టు తెలిపింది. ఏపీలో 11 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.
Published date : 16 Apr 2020 06:13PM

Photo Stories