దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ : హోం మంత్రి అమిత్ షా
Sakshi Education
దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 20న రాజ్యసభలో ప్రకటించారు.
ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా మాట్లాడారు. ‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్‌ఆర్‌సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అమిత్ షా అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తాం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తాం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Published date : 21 Nov 2019 06:01PM