దేశవ్యాప్తంగా బీఎస్–6 ఇంధన విక్రయాలు
Sakshi Education
వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీఎస్–6 ఇంధన విక్రయాలు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు
దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ కూడా చేరింది. 2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్–6లో కాలుష్యకారక సల్ఫర్ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. బీఎస్–3లో 350 కాగా.. బీఎస్–4లో 50 పీపీఎం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీఎస్–6 ఇంధన విక్రయాలు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు
Published date : 02 Apr 2020 03:09PM