Skip to main content

దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17 రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మార్చి 31న వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Current Affairsఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు అనుమతిస్తారని కేంద్ర హోంశాఖ మార్చి 22న తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోరుుంది.
 
 రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులు బంద్
 కరోనా మహమ్మారి విస్తరించకుండా మార్చి 31 వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణరుుంచింది. మార్చి 22వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం సరుకు రవాణా చేసే గూడ్‌‌స రైళ్లను మాత్రమే అనుమతిస్తారు.
 
 జనతా కర్ఫ్యూ విజయవంతం
 ప్రమాదకర కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలంతా మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేశారు.
Published date : 23 Mar 2020 06:19PM

Photo Stories